నల్లగొండ జిల్లా : నల్లగొండ జిల్లాలో(Nallagonda) విషాదం చోటు చేసుకుంది. తన భూమిలో ఫారెస్ట్ అధికారులు(Forest officials) మొక్కలు నాటుతున్నారని(Planting saplings) కలత చెందిన ఓ రైతు ఆత్మహత్య(Farmer commits suicide) చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన అడవిదేవులపల్లి మండలం బంగారకుంఠ గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన కుర్ర కస్న అనే రైతు మొల్కచర్ల ఫారెస్ట్ పరిధిలో గత పది సంవత్సరాల నుంచి భూమి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఈ భూమిలో ఫారెస్ట్ అధికారులు బలవంతంగా మొక్కలు నాటడం ప్రారంభించ్చినట్లు తెలిసింది. దీంతో మనస్థాపానికి గురై రైతు కస్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.