వాషింగ్టన్: వరుస సంచలనాలతో ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా వైదొలగుతున్నట్టు ప్రకటించారు. భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి సహా 66 ప్రపంచ సంస్థల నుంచి వైదొలుగాలని అమెరికా నిర్ణయించింది.
ఈ సంస్థలు అమెరికా స్వాతంత్య్రాన్ని, ఆర్థిక పునాదులను బలహీన పరుస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. 35 ఐరాసయేతర సంస్థలు, 31 ఐరాస సంబంధ సం స్థల నుంచి ఉపసంహరించుకునే ప్ర కటనపై ట్రంప్ బుధవారం సంతకం చేశారని శ్వేత సౌధం వర్గాలు తెలిపాయి. అవి అమెరికా విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.