Matka King | బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాని నటించిన ఎంసీఏ (MCA) సినిమాతో తెలుగులో మెరిసిన ఇతడు బాలీవుడ్లో విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయితే ఈ నటుడు తాజాగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం మట్కా కింగ్ (Matka King). ఈ సినిమాకు సైరత్(Sairat) సినిమా ఫేం బ్లాక్ బస్టర్ మరాఠీ దర్శకుడు నాగరాజు మంజులే (Nagaraju Manjule) దర్శకత్వం వహిస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూన్ 12న ఈ చిత్రం నేరుగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ పోస్టర్‌తో విజయ్ వర్మ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ చిత్రం ముంబై గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్నట్లు చిత్ర దర్శకుడు నాగరాజు మంజులే తెలిపాడు. రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను గార్గి కులకర్ణి, ఆశిష్ ఆర్యన్, అశ్విని సిద్వానీలతో కలిసి సిద్ధార్థ్ రాయ్ కపూర్ నాగరాజ్ మంజులే నిర్మిస్తున్నారు. కృతిక కమ్రా, సాయి తంహంకర్, గుల్షన్ గ్రోవర్ సిద్ధార్థ్ జాదవ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Now Filming: All in for the Matka King’s rise ✨#MatkaKingOnPrime@MrVijayVarma @SaieTamhankar @Kritika_Kamra @GulshanGroverGG #SiddharthJadhav @Nagrajmanjule #SiddharthRoyKapur @AshwiniSidwani #AshishAryan #GargeeKulkarni @jinontherocks #BharatiKandhari @abhay_koranne… pic.twitter.com/tWBddk485G
— Roy Kapur Films (@roykapurfilms) June 12, 2024