T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అమెరికా (USA) చరిత్రకు అడుగు దూరంలో నిలిచింది. అరంగేట్రంలోనే సమిష్ఠి ప్రదర్శనతో అదరగొడుతున్న యూఎస్ఏ సంచలన విజయాలకు కేరాఫ్ అయింది. తొలి పోరులో కెనడాకు.. అనంతరం మాజీ చాంపియన్ పాకిస్థాన్ (Pakistan)కు షాకిచ్చిన ఆతిథ్య జట్టు మరో రెండు పాయింట్లు సాధిస్తే సూపర్ 8కు దూసుకెళ్తుంది.
అవును. జూన్ 14 శుక్రవారం అమెరికా ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సిద్దమైంది. అయితే.. ఐర్లాండ్‌తో ఫ్లోరిడాలో జరిగే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉంది. ఒకవేళ వాన ఎక్కువగా పడితే ఆట సాధ్యం కాకపోవచ్చు. అదే జరిగితే ఇరుజట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు. అప్పుడు ఐదు పాయింట్లతో అమెరికా సూపర్ 8కు చేరుతుంది.
Weather, the biggest player in today’s #USAvIRE clash 🌧️
Reminder that if the game is washed out, USA go through eliminating Pakistan & Ireland
Preview: https://t.co/sYlG2LZhXx | #T20WorldCup pic.twitter.com/cQ51awh5Hm
— ESPNcricinfo (@ESPNcricinfo) June 14, 2024
ప్రస్తుతం అమెరికా ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. దాంతో, వాన పడని నేపథ్యంలో ఐరిష్ టీమ్‌పై గెలిస్లే ఆరు పాయింట్లతో ఆతిథ్య దేశం దర్జాగా సూపర్ 8 బెర్తు దక్కించుకుంటుంది. ఆ పరిస్థితుల్లో ఐర్లాండ్‌తో పాటు బాబర్ ఆజం సేన టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. కానీ, ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడితే పాక్‌కు కలిసొస్తుంది.
‘USA favourites, but Ireland must dare to dream’ – @niallnobiobrien 🗣️ #TimeOut | #USAvIRE pic.twitter.com/gTnwTAVEZe
— ESPNcricinfo (@ESPNcricinfo) June 14, 2024
తర్వాతి పోరులో బాబర్ సేన ఐరిష్ టీమ్‌ను ఓడిస్తే నెట్ రన్‌రేటులో యూఎస్ఏను వెనక్కి నెట్టి సూపర్ 8కు చేరే అవకాశముంది. ఒకవేళ ఐర్లాండ్, పాక్ మ్యాచ్ సైతం వాన కారణంగా రద్దయితే అమెరికా పంట పండినట్టే. మొనాక్ పటేల్ సారథ్యంలోని ఆ జట్టు సూపర్ 8లో అడుగు పెట్టి చరిత్ర లిఖిస్తుంది. ఇప్పటికే గ్రూప్ ‘ఏ’ నుంచి హ్యాట్రిక్ విజయాలతో టీమిండియా క్వాలిఫై అయిన విషయం తెలిసిందే.