అమరావతి : ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును టీడీపీ సీనియర్లు సచివాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు కలిసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu ) మీడియాతో మాట్లాడారు.
కేబినెట్(Cabinet) లో యువతకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అందరూ స్వాగతించాలని సూచించారు. మార్పుకోసం ప్రజలు తీర్పునిచ్చారని, దానికి అనుగుణంగా మంత్రి వర్గ కూర్పు ఉండాలన్నదీ చంద్రబాబు(Chandra Babu) ఉద్దేశమని అన్నారు. అంకితభావం , చిత్తశుద్ధితో మంత్రులు పనిచేయాలని సూచించారు. యువత (Youth) రాజకీయంలోకి వచ్చినప్పుడు వారికి అవకాశాలు కల్పిస్తే పార్టీగాని , ప్రభుత్వం గాని నాలుగు కాలాల పాటు ఉంటుందని అన్నారు.
గతంలో తాను 2007, 2009లో మహానాడు(Mahanadu) లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని సభాముఖంగా చెప్పానని గుర్తు చేశారు. కేబినెట్లో యనమల ఉన్నారా లేదా అన్నది పెద్ద విషయం కాదని అన్నారు. సీనియర్లు పార్టీకి ఉపయోగపడాలి.. జూనియర్లకు అవకాశాలు కల్పించాలని కోరారు. కేబినెట్‌తోపాటు మిగతా నేతలంతా చిత్తశుద్ధితో పని చేస్తామని, మంత్రి వర్గ కూర్పు వంద శాతం బాగుందని కొనియాడారు.