Asia Cup 2025 : భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఇప్పట్లో జరిగేలా లేవు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తోంది. పాక్‌తో ఆడే ప్రసక్తే లేదని టీమిండియా మాజీ ఆటగాళ్లు తేల్చి చెప్పడంతో.. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ (World Champions Of Legends)లో ఆదివారం ఇరుజట్లు తలపడాల్సిన మ్యాచ్ రద్దు అయింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య క్రికెట్‌కు ఆస్కారమే లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఆసియా కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నీ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న వేళ.. భారీ ఆదాయం సమకూర్చుకోవాలనుకున్న క్రికెట్ బోర్డు (PCB)కి షాక్ తగిలినట్టే.
ఈ ఏడాది పురుషుల ఆసియా కప్ నిర్వహణతో 8.8 బిలియన్లు అంటే రూ. 800 కోట్లు ఆర్జించాలని పీసీబీ అనుకుంది. ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంయుక్తంగా నుంచి ఈ ఈవెంట్ ద్వారా వచ్చే ఈ సొమ్ముతో ఆర్ధికంగా బలపడాలని పాక్ బోర్డు ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, బీసీసీఐ ఇచ్చిన షాక్‌తో ఎక్కడ టోర్నీ తటస్ఠ వేదికకు తరలిపోతుందేమోనని పీసీబీ ఆందోళన చెందుతోంది.
‘ఆసియా కప్ నిర్వహణతో వచ్చే ఆదాయంతో మా దేశంలో క్రికెట్ విస్తరణకు ఎంతో పనికొస్తుందని అనుకున్నాం. ఐసీసీ, ఏసీసీల సహకారంతో జరిగే ఈ టోర్నీ ద్వారా 800 కోట్లు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ, టోర్నీ షెడ్యూల్‌తో పాటు వేదికలు ఇంకా ఖరారు కాలేదు’ అని పీసీబీ అధికారి ఒకరు వాపోయారు. శ్రీలంక, అఫ్గనిస్థాన్‌లో ఆసియా కప్ ఆడేందుకు అభ్యంతరం లేదని బీసీసీఐ అంటోంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ షెడ్యూల్‌పై చర్చించడానికి జూలై 24న ఆసియా క్రికెట్ మండలి సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో వేదికలపై స్పష్టత వస్తుందని సమాచారం. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్‌లో ఆసియా కప్
జరగాల్సి ఉంది.
🛑INDIA-PAKISTAN CHAMPIONS WCL 2025 CLASH CALLED OFF
-Hopefully, we continue to see this deshbhakti from Indians in the upcoming World Cup, Asia Cup, and other sports events. pic.twitter.com/AB8tnxoLMD
— DR Yadav (@DrYadav5197) July 20, 2025
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌తో భారత్ కొన్నేళ్లుగా అంటీముట్టనట్టే ఉంటోంది. చిరకాల ప్రత్యర్థి ఆతిథ్యమిచ్చే ఐసీసీ టోర్నీల్లో ఆడబోమని బీసీసీఐ తెగేసి చెప్పడంతో హైబ్రిడ్ వేదికలపై టీమిండియా మ్యాచ్‌లను నిర్వహిస్తోంది ఐసీసీ. అయితే.. పహల్గాం దాడి తర్వాత దాయాదితో క్రికెట్ అనే ముచ్చటే లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేకాదు వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో రెండు జట్లను ఒకే గ్రూప్‌లో చేర్చవద్దని ఐసీసీకి రాజీవ్ శుక్లా (Rajeev Shukla) లేఖ కూడా రాశాడు. సో.. అప్పటి నుంచి ఆసియా కప్ నిర్వహణపై అనిశ్చితి మొదలైంది. పాక్ గడ్డపై ఈ ఏడాది జరగాల్సిన ఈ టోర్నీకి భారత జట్టును పంపబోయని బోర్డు ఇప్పటికే చెప్పింది. దాంతో, నిరుడు ఆసియా కప్ మాదిరిగానే ఈసారి కూడా హైబ్రిడ్ తరహాలోనే ఈవెంట్‌ను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.