Landslides | మాతా వైష్ణో దేవి యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. పలువురికి గాయాలు
Landslides | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని రియాసి (Reasi) జిల్లాలో గల పవిత్ర మాతా వైష్ణో దేవి (Vaishno Devi) ఆలయానికి వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం భారీ కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి.
Landslides | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని రియాసి (Reasi) జిల్లాలో గల పవిత్ర మాతా వైష్ణో దేవి (Vaishno Devi) ఆలయానికి వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం భారీ కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. బంగంగా ప్రాంత సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జమ్ము కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు కత్రా నుంచి భవన్కు వెళ్లే పాత యాత్ర మార్గంలోని బంగంగా ప్రాంతం గుల్షన్ కా లంగర్ వద్ద ఉదయం 8 గంటల సమయంలో కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 10 మంది భక్తులు గాయపడ్డారు. ఈ మార్గం యాత్రికులకు అత్యంత ప్రజాదరణ పొందిన, పురాతనమైన మార్గాల్లో ఒకటి. రోజూ వేలాది మంది యాత్రికులు ఈ మార్గం గుండా ప్రయాణిస్తారు. ఈ ఘటన తర్వాత ఈ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించింది. మరోవైపు శిథిలాల కింద ఇంకెవరైనా చిక్కుకుపోయారా అన్న అనుమానంతో అక్కడ గాలింపు చేపడుతున్నారు. ఈ ఘటనలో యాత్ర మార్గంలో నిర్మించిన షెల్టర్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Also Read..
MK Stalin | తమిళనాడు సీఎం స్టాలిన్కు అస్వస్థత.. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స
Air India | రన్వేపై అదుపుతప్పిన ఎయిర్ ఇండియా విమానం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

