MK Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM ) ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు సీఎంను అన్నా సలైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్ (Chennai Apollo Hospital)కు తరలించారు. అక్కడ సీఎంకు చికిత్స కొనసాగుతోంది.
‘సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో సీఎంకు కళ్లు తిరగడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన అన్ని పరీక్షలు చేస్తున్నాం’ అని అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ బీజీ తెలిపారు. ఈ మేరకు సీఎం ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
Also Read..
Air India | రన్‌వేపై అదుపుతప్పిన ఎయిర్ ఇండియా విమానం