Team India : ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్ సమం చేయాలనే కసితో ఉన్న భారత జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తలుగుతున్నాయి. ప్రధాన ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే బర్మింగ్హమ్ టెస్టు హీరో ఆకాశ్ దీప్(Akash Deep)సెలెక్షన్‌కు అందుబాటులో లేడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సైతం వేలి గాయంతో సిరీస్ నుంచి వైదొలిగాడు. అంతలోనే నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) కూడా అనూహ్యంగా సిరీస్‌కు దూరమయ్యాడు. లార్డ్స్ టెస్టులో బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఈ తెలుగు కుర్రాడు మోకాలి గాయంతో బాధ పడుతున్నాడు. సో.. కీలకమైన చివరి రెండు మ్యాచులకు గిల్ సేన ఈ యువ ఆల్‌రౌండర్ సేవల్ని కోల్పోనుంది.
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్‌లో జూలై 23 బుధవారం జరుగనుంది. ఇప్పటికే ఈ సిటీకి చేరుకున్న భారత జట్టు నెట్స్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతోంది. మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే ఉందనగా నితీశ్ రెడ్డి మోకాలి గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇంతకు అతడు ఎలా గాయపడ్డాడు? అనేది తెలియడం లేదు. అయితే.. సోమవారం నితీశ్‌కు స్కానింగ్ పరీక్షలు నిర్వహించగా.. అతడి ఎడమ మోకాలికి తీవ్రమైన గాయం అయినట్టు వైద్యులు గుర్తించారు. దాంతో, అతడు చికిత్స కోసం స్వదేశం తిరిగి రానున్నాడు. ఈ యువ ఆల్‌రౌండర్ స్థానాన్ని శార్థూల్ ఠాకూర్ భర్తీ చేసే అవకాశముంది.
🚨 Squad Update: Nitish Kumar Reddy ruled out of the series. Arshdeep Singh ruled out of fourth Test 🚨
The Men’s Selection Committee has added Anshul Kamboj to the squad.
More details here – https://t.co/qx1cRCdGs0 #TeamIndia #ENGvIND
— BCCI (@BCCI) July 21, 2025
బర్మింగ్‌హోమ్‌లో 9 వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీసిన ఆకాశ్ దీప్ (Akash Deep) గాయపడ్డాడు. అతడు మాంచెస్టర్ టెస్టులో ఆడడం సందేహంగా ఉంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) సైతం గాయంతో బాధ పడుతున్నాడు. కోలుకుని జట్టుతో కలుస్తాడనుకుంటే అర్ష్‌దీప్ సైతం వేలి గాయంతో సిరీస్ నుంచి వైదొలిగాడు. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ లయన్స్ (England Lions)పై వికెట్ల వేట కొనసాగించిన యువ పేసర్ అన్షుల్ కంభోజ్ (Anshul Kamboj)ను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు. పేస్ దళంతో పాటు మిడిలార్డర్ కూర్పు ఇప్పుడు కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్‌కు సవాల్‌గా మారింది.