Viral Video | హర్యానాలో బీభత్సం సృష్టించిన కారు.. నడిపింది ఎవరంటే?
హర్యానాలోని ఓ వీధిలో కారు బీభత్సం సృష్టించింది (Dangerous Driving). కారు నడుపుతున్న వారు నియంత్రణ కోల్పోవడంతో అది వీధిలో ఉన్న వాహనాలు, జనాలపైకి దూసుకెళ్లింది.
న్యూఢిల్లీ: హర్యానాలోని ఓ వీధిలో కారు బీభత్సం సృష్టించింది (Dangerous Driving). కారు నడుపుతున్న వారు నియంత్రణ కోల్పోవడంతో అది వీధిలో ఉన్న వాహనాలు, జనాలపైకి దూసుకెళ్లింది. ఓ బైకర్, ముగ్గురు పిల్లలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా పలు బైకులు ధ్వంసమయ్యాయి. ఈ నెల 16న ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా (Viral Video) మారింది. ఈ వీడియోను ఘర్ కే కాలేశ్ అనే పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్లో ఓ వ్యక్తి పోస్టు చేశారు. అయితే కారును నడిపింది ఓ బాలుడు. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి ఇదో ఉదాహరణ అని తన పోస్టులో రాసుకొచ్చారు.
ఈనెల 16న సమయం పొద్దున 8.13 గంటలు అవుతుంది. ఇరుకుగా ఉన్న ఓ గల్లీలో ఇండ్ల ముందు ఓ కారుతోపాటు బైకులు పార్క్చేసి ఉన్నాయి. ఇద్దరు పిల్లలు సరదాగా తమ ఎస్యూవీ కారులో (హ్యుండాయ్ వెన్యూ) ఎక్కి కూర్చుకున్నారు. తాళంతో కారు ఇంజిన్ను స్టార్ట్ చేసి దానిని నడిపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ సీట్లో కూర్చుకున్న పిల్లాడు కారుపై నియంత్రణ కోల్పోవడంతో అది అదుపుతప్పి వీధిలోకి దూసుకెళ్లింది. తొలుత ప్రమాదకరంగా ఓ మలుపు తిరిగిన ఆ కారు.. అలానే ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఎదురుగా బైక్పై వస్తున్న వ్యక్తి కారును గమనించి పక్కకు దూకేశాడు. దీంతో రెప్పపాటులో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఆ తర్వాత వీధిలో పార్క్ చేసిన బైకులపైకి కారు దూసుకెళ్లింది. నడుకుంటూ వస్తున్న ఓ పిల్లవాడు వేగంగా వస్తున్న కారును చూసి భయంతో ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఓ ఇంటి తలుపు తెరచి ఉండటంతో అందులోకి వెళ్లాడు. దీంతో ప్రాణాలను రక్షించుకున్నాడు. అక్కడ మెట్లను, ఓ బైకును ఢీకొడుతూ ముందుకు దూసుళ్లింది. అప్పుడు సందులో నుంచి వీధిలోకి వచ్చిన ఇద్దరు చిన్నారులు.. ఆ కారు తమపైకి వస్తున్నట్లు గ్రహించి అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఓ ఇంటి ముందున్న మోటారు సైకిల్ను ఢీకొట్టి ఆగిపోయింది. కారు ఆగిన తర్వాత అందులో ఉన్న ఇద్దరు పిల్లలు వణుకుతూ కిందికి దిగారు. ఇది చూసి స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వారే కారును నడిపినట్లు గ్రహించారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కారు ఓనరు నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
Parents’ negligence in Haryana led to minors crashing a Hyundai Venue into parked bikes, caught on CCTV. Locals suspect the kids were stunting with their parents’ car—a clear parenting failure. pic.twitter.com/OZXOByw9nJ
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 19, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

