ICC : ఐసీసీ అవార్డుల్లో శ్రీలంక క్రికెటర్లు జోరు చూపించారు. ఆగస్టు నెలకు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ (Player Of The Month) అవార్డులను కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో దునిత్ వెల్లలాగే(Dunith Wellalage), మహిళల కోటాలో ఆసియా కప్ హీరో హర్షిత సమరవిక్రమ (Harshitha Samarawickrama)లు విజేతగా నిలిచారు. ఈ ఇద్దరూ టీమిండియా(Team India)పై అద్భుత ప్రదర్శనకుగానూ ఈ అవార్డుకు ఎంపికవ్వడం విశేషం. వన్డే సిరీస్‌లో వెల్లలాగే బ్యాటుతో, బంతితో రాణించగా ఆసియా కప్ ఫైనల్లో సమరవిక్రమ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.
ఆగస్టు నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు వెల్లలాగే, సమరవిక్రమలు ఎంపికైనట్టు ఐసీసీ తెలిపింది. ఆగస్టులో వెల్లలాగే, సమరవిక్రమలు సంచలన ఆటతో జట్టు విజయాల్లో భాగమయ్యారు. టీమిండియాపై వన్డే సిరీస్‌లో వెల్లలాగే అద్భుతంగా రాణించాడు. తొలి వన్డేలో 67 నాటౌట్, రెండో మ్యాచ్‌లో 37 పరుగులతో లంకను ఆదుకున్నాడు. ఆఖరి వన్డేలో 27 పరుగులకే ఐదు వికెట్లు తీసి రోహిత్ సేనను దెబ్బకొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు ఎగరేసుకుపోయాడు.
A rising all-round star Dunith Wellalage became the second player from Sri Lanka to win the ICC Men’s Player of the Month in 2024.
Congratulations 🇱🇰pic.twitter.com/ycRJOwbvML #LKA #SriLanka #CricketTwitter
Dunith Wellalage’s all-round brilliance against India helped him win the…— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) September 16, 2024
ఇక హర్షిత సమరవిక్రమ అయితే.. లంకకు తొలిసారి మహిళల ఆసియా కప్(Womens Asia Cup) టైటిల్ కట్టబెట్టింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టుపై సమరవిక్రమ మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడింది. 51 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 166 పరుగుల ఛేదనలో కెప్టెన్ చమరి ఆటపట్లు 61 అర్ధ శతకంతో విరుచుకుపడగా.. ఆ తర్వాత సమరవిక్రమ విధ్వంసం సృష్టించింది.
హర్షిత సమరవిక్రమ(69 నాటౌట్)
మూడో వికెట్‌కు కవిశ దిల్హరితో కలిసి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దాంతో, 8 వికెట్ల తేడాతో గెలుపొందిన లంక మొదటిసారి చాంపియన్‌గా అవతరించింది. అనంతరం ఐర్లాండ్ పర్యటన(Ireland Tour)లోనూ సమరవిక్రమ రెండు టీ20ల్లో 86 నాటౌట్, 65 పరుగులతో రాణించింది.