Prithviraj Sukumaran | ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ : ధర ఎంతంటే..!
Duplex Apartment : ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబైలోని బాంద్రా పాలి హిల్ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు.
Prithviraj Sukumaran : ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబైలోని బాంద్రా పాలి హిల్ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. తన ప్రొడక్షన్ హౌస్ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఈ ప్రాపర్టీని ఆయన ఏకంగా రూ. 30.6 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇదే ప్రాంతంలో పృథ్వీరాజ్ ఆయన భార్య సుప్రియా మీనన్‌లు రూ. 17 కోట్ల విలువైన మరో అపార్ట్మెంట్ కలిగిఉన్నారు.
ఇక నటుడు కొనుగోలు చేసిన లగ్జరీ అపార్ట్మెంట్లో 3, 4,5 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. పృథ్వీరాజ్ డూప్లెక్స్ 2971 ఎస్ఎఫ్టీలో విస్తరించిఉంది. ఈ అపార్ట్‌మెంట్‌కు నాలుగు కారు పార్కింగ్ స్పేసెస్ కేటాయించారు. సెప్టెంబర్‌లో ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను పృథ్వీరాజ్ కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు స్టాంప్ డ్యూటీ కింద ఆయన రూ. 1.84 కోట్లు చెల్లించారు.
బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతం బాలీవుడ్ సెలబ్రిటీలు నివసించే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందింది. గత కొద్ది నెలలుగా ఈ ప్రాంతంలో రణ్వీర్ సింగ్, తృప్తి డిమ్రీ, అథియా శెట్టి వంటి సినీ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్ కేఎల్ రాహుల్ వంటి ప్రముఖులు ఖరీదైన అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే సలార్‌కు కొనసాగింపుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ 2లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
Read More :
Hema Drugs Case | పరువు కోసం చచ్చిపోతా.. డ్రగ్స్ కేసులో మీడియాపై మండిపడిన హేమ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

