Hema | బెంగళూరు రేవ్ పార్టీ (Bengaluru Rave Party)లో టాలీవుడ్ సినీ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. హేమ (hema) డ్రగ్స్ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. ఈ కేసులో నటి హేమతోపాటు 88 మంది డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు వివరించారు. చార్జీషీట్లో రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మందిని పేర్కొన్నారు.
అయితే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేయడంపై నటి హేమ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు గతంలో ఎలా అయితే పలు మీడియా ఛానళ్లు ప్రచారం చేశారో.. అదే పాత వార్తలను తీసుకువచ్చి మళ్లీ ప్రచురిస్తున్నారు. హేమకు పాజిటివ్ వచ్చింది అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ నేనే ఇంకా చూడలేదు. మీరు ఎలా చూశారు అంటూ మీడియాపై మండిపడింది హేమ. తానే స్వయంగా మీడియా పెద్దల వద్దకు వస్తానని.. వారే టెస్ట్ చేయించాలని హేమ సవాల్ విసిరారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షైనా అనుభవిస్తానని నెగిటివ్ వస్తే తనకు న్యాయం చేయాలన్నారు. పరువు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమని హేమ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారు అని న్యూస్ చానెల్స్ పై హేమ సిరీస్#Hema #hemakolla #Raveparty #Bangaloreraveparty #Tollywood #Filmify #Filmifytelugu pic.twitter.com/WTifKqHPwT
— Filmify Official (@FilmifyTelugu) September 16, 2024