TGSRTC | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం గణేశ్ నిమజ్జనానికి సిద్ధమైంది. గణేశ్ శోభాయాత్రతో పాటు నిమజ్జన వేడుకను వీక్షించాలనుకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. నగర వ్యాప్తంగా 600 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30 డిపోల నుంచి 15 – 30 బస్సులు అందుబాటులో ఉంటాయని, భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక బస్సులతో పాటు తదితర వివరాల కోసం రేతిఫైల్(9959226154), కోఠి బస్టాండ్(9959226160)లలో సంప్రదించాలన్నారు.
ఇవి కూడా చదవండి..