Team India : స్వదేశంలో 18వ టెస్టు సిరీస్ విజయంతో జోరు మీదున్న భారత జట్టు టీ20 సిరీస్‌పైనా కన్నేసింది. రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్ చేసిన టీమిండియా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సారథ్యంలో పొట్టి పోరుకు సిద్దమైంది. అయితే.. మ్యాచ్‌కు ముందు రోజు ‘మెన్ ఇన్ బ్లూ’కు ఊహించని షాక్ తగిలింది. యువ ఆల్‌రౌండర్ శివం దూబే(Shivam Dube) అనుకోకుండా బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు.
టీ20 వరల్డ్ కప్‌లో మెరపులు మెరిపించలేకపోయిన దూబే సొంతగడ్డపై సత్తా చాటాలనుకున్నాడు. అందుకు తగ్గట్టే నెట్స్‌లో సాధన చేశాడు. అయితే.. శనివారం ప్రాక్టీస్ సమయంలో తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా దూబే సిరీస్ మొత్తానికి అందుబాటులో ఉండడం లేదు. దాంతో, అజిత్ అగార్కర్(Ajit Agarkar) సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ అతడి స్థానంలో యువకెరటం తిలక్ వర్మ(Tilak Varma)ను ఎంపిక చేసింది.
🚨 NEWS 🚨
Shivam Dube ruled out of #INDvBAN T20I series.
The Senior Selection Committee has named Tilak Varma as Shivam’s replacement.
Details 🔽 #TeamIndia | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 5, 2024
‘వెన్నునొప్పి కారణంగా ఆల్‌రౌండర్ శివం దూబే బంగ్లాదేశ్‌తో మూడు టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడు. దాంతో, అతడి స్థానంలో సీనియర్ సెలెక్షన్ కమిటీ తిలక్ వర్మను ఎంపిక చేసింది’ అని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 6, ఆదివారం ఉదయం తిలక్ జట్టుతో కలువనున్నాడు. ఐపీఎల్ ఫామ్‌తో బ్లూ జెర్సీ వేసుకున్న తిలక్ మిడిల్, డెత్ ఓవర్లలో ధాటిగా ఆడగలడు. ఇప్పటివరకూ దేశం తరఫున 16 టీ20లు ఆడిన తిలక్.. బంగ్లాదేశ్‌పై చెలరేగితే.. పొట్టి ఫార్మాట్లో తన స్థానాన్ని పదిలి చేసుకొనే అవకాశమంఉంది.
🗣️ It’s a good opportunity for the youngsters & newcomers.#TeamIndia Captain @surya_14kumar ahead of the T20I series against Bangladesh.#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/T7kM6JO02o
— BCCI (@BCCI) October 5, 2024
భారత స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్,