Srisailam | శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శనివారం భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శనివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి ఈవో పెద్దిరాజు ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. స్వామి అమ్మవార్ల శేష వస్త్రంతో సన్మానించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు.