Health tips | రోజూ వ్యాయామం చేస్తే అది పెరుగుతుందట.. ఏదో తెలుసా..!
Health tips : చాలా మంది మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్, రక్తంలో కొలెస్టరాల్ లాంటి జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ దీర్ఘాకాలిక వ్యాధులతో అప్పటికప్పుడు వచ్చే సమస్య ఏమీ లేకపోయినా దీర్ఘకాలికంగా చూసుకుంటే మాత్రం ఆయుఃప్రమాణం తగ్గుతుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారితో పోల్చితే ఈ వ్యాధులు ఉన్నవారి ఆయుష్షు తక్కువని చెప్పవచ్చు. అయితే వ్యాధులతో సంబంధం లేకుండా ఎవరైనా నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆయుఃప్రమాణాన్ని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Health tips : చాలా మంది మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్, రక్తంలో కొలెస్టరాల్ లాంటి జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ దీర్ఘాకాలిక వ్యాధులతో అప్పటికప్పుడు వచ్చే సమస్య ఏమీ లేకపోయినా దీర్ఘకాలికంగా చూసుకుంటే మాత్రం ఆయుఃప్రమాణం తగ్గుతుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారితో పోల్చితే ఈ వ్యాధులు ఉన్నవారి ఆయుష్షు తక్కువని చెప్పవచ్చు. అయితే వ్యాధులతో సంబంధం లేకుండా ఎవరైనా నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆయుఃప్రమాణాన్ని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీవనశైలి వ్యాధులతో బాధపడేవారితోపాటు ఆరోగ్యంగా ఉన్న వారి ఆయుఃప్రమాణం పెరగడానికి వ్యాయామం బాగా పనిచేస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మనిషి జీవిత కాలం పెరగాలంటే ప్రతిరోజు సగటున 7 వేల అడుగులు నడవాల్సిందేనని సూచిస్తున్నారు. లేదంటే వారంలో కనీసం రెండున్నర గంటలు శారీరక శ్రమ చేయాల్సిందేనని అంటున్నారు. ఇటీవల జరిగిన అధ్యయనాల ఫలితాల ఆధారంగా నిపుణులు ఈ సూచనలు చేస్తున్నారు.
పది వేల మందిపై అధ్యయనం
పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు టెన్నిస్, సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్ లేదా బ్యాడ్మింటన్ లాంటి క్రీడలపట్ల దృష్టిపెడితే శరీరాలకు మంచి వ్యాయామం అవుతుందని ఇటీవల రెండు వేర్వేరు అధ్యయనాల్లో తేలింది. ఈ రెండు అధ్యయనాలు కూడా శారీరక శ్రమతోనే మనిషి జీవితకాలం పెరుగుతుందని స్పష్టంచేశాయి. దశాబ్దకాలంగా దాదాపు 10 వేల మంది స్త్రీలు, పురుషుల అభిప్రాయాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, వచ్చిన ఫలితాల ఆధారంగా నివేదికను రూపొందించారు.
శరీరాలకు కావాల్సినంత వ్యాయామం లేకపోవడంవల్ల గుండెపోటు, పక్షవాతం లాంటివి సంభవించి అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఈ అకాల మరణాలను 70 శాతం వరకు తగ్గించవచ్చని నూతన అధ్యయనాల్లో తేలింది. సాధారణ వ్యాయామంతోపాటు యోగాసనాలు వేసేవాళ్లు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని ఈ అధ్యయనాలు సూచించాయి. వ్యాయామాలవల్ల ఆయుర్దాయం పెరుగడమేగాక వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుందని అధ్యయనాల్లో తేలింది.
శారీరక శ్రమే రక్ష
నిత్యం వ్యాయామాలు చేసేవాళ్లతో పోల్చితే.. అస్సలు వ్యాయామం చేయనివాళ్లు, అరుదుగా వ్యాయామం చేసేవాళ్లలో వ్యాధినిరోధక శక్తి తగ్గినట్లు పరిశోధనలు స్పష్టంచేశాయి. 2018లో అమెరికాలో జరిగిన అధ్యయనం ప్రకారం.. అమెరికన్లలో 40 నుంచి 70 ఏండ్ల మధ్య వయసువారి మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. వారిలో 10 శాతం మంది మరణాలకు చాలా తక్కువ సమయం వ్యాయామం చేయడమే కారణమని తేలింది. కాబట్టి నిత్యం వ్యాయామం చేయడం అన్ని విధాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

