ENGW vs BANW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన బంగ్లాదేశ్(Bangladesh) మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను స్పిన్ ఉచ్చులో పడేసింది. వలర్డ్ క్లాస్ బ్యాటర్లో కూడిన ఇంగ్లీష్ టీమ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. బంతి టర్న్ కావడంతో రెచ్చిపోయిన స్పిన్నర్లు నహిదా అక్తర్(2/32), ఫహిమా ఖాతూన్(2/18)లు వరుస వికెట్లతో వణుకు పుట్టించారు. ఈ ఇద్దరి ధాటికి సహచర అమ్మాయిలంతా డగౌట్ చేరుతుంటే ఓపెనర్ డానియల్ వ్యాట్(43) మాత్రం ఒంటరి పోరాటం చేసింది. ఆఖర్లో వికెట్ కీపర్ అమీ జోన్స్(12 నాటౌట్) ధనాధన్ ఆడడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చసింది.
వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. షార్జా క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్‌ను 120లోపే కట్టడి చేసింది. ఓపెనర్లు మయా బౌచర్(23), డానియల్ వ్యాట్(43)లు శుభారంభం ఇచ్చినా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. పైగా పిచ్ స్పిన్‌కు అనుకూలించడం కూడా బంగ్లాకు కలిసొచ్చింది.
నహిదా అక్తర్(2/32), ఫహిమా ఖాతూన్(2/18)లు ఇంగ్లండ్ మిడిలార్డర్‌ను క్రీజులో నిలువనీయలేదు. దాంతో.. ఒకదశలో 48-1తో పటిష్ఠ స్థితిలో నిలిచిన ఇంగ్లండ్ 90 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే.. ఆఖర్లో అమీ జోన్స్(12 నాటౌట్) ధాటిగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.