మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 8 : మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రాంపల్లిలో దయారాలో నిర్వహిస్తున్న సీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. అంతకుముందు కేటీఆర్కు ఎమ్మెలే మల్లారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చామకూర మల్లారెడ్డి బౌలింగ్ వేయగా కేటీఆర్ బ్యాటింగ్ చేసి క్రీడాకారులు, బీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహాన్ని నింపారు.
మున్సిపాలిటీ ఎన్నికలు జరుగగా రెండింటిని బీఆరర్ఎస్ కైవసం చేసుకోవడం హర్షనీయమన్నారు కేసీఆర్ తిరిగి సీఎం అయ్యే వరకు యువత ఇదే జోష్తో ఉండాలని అన్నారు. అంతకుముందు మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచిన మహిళా నేతలకు కేటీఆర్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్లో ఇదే పోరాట పటిమతో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వద్దామన్నారు. అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట, మూడుచింతలపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్లు శ్రీదేవి, జాంరవి, బీఆర్ఎస్ నేతలు చామకూర మహేందర్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, గజ్జెల నగేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.