తాండూర్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను (KTR Birthday ) శుక్రవారం మంచిర్యాల జిల్లా తాండూర్( Tandur ) మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రయాణికులకు, ఆటో కార్మికులకు, వ్యాపార వాణిజ్య సంస్థలు, ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ కేటీఆర్ ప్రజాసేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కేటీఆర్ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు.

ఐటీ రంగంలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కేటీఆర్కే దక్కుతుందని కొనియాడారు.తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందించి రైతులను రాజుగా చూశారని పేర్కొన్నారు.ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఎరువుల కోసం యాప్లు పెట్టి యూరియా దొరకకుండా రైతులను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని, మళ్లీ ఆయన వస్తేనే రైతులకు స్వర్ణయుగం తిరిగి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మంగపతి సురేష్ బాబు, పూసాల ప్రణయ్ కుమార్, ఎల్క రామచందర్, మాసాడి శ్రీరాములు, గట్టు సంతోష్ కుమార్, అబుసాదు, జాడి పోషం, దుర్గం శ్రీనివాస్, గడ్డం మణికుమార్, బాబుఖాన్, రావుల స్వామి, చింటూ, ఇగ్బాల్ హాబీబ్, ఖలీల్, సుమన్, తిరుపతి, సంతోష్,బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.