ఇల్లెందు, జూలై 24 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఆశాజ్యోతి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా ఇల్లెందు పట్టణంలో ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత జగదాంబ సెంటర్లోని తెలంగాణ తల్లి చౌరస్తాకు చేరుకుని మోటార్ సైకిల్ ర్యాలీ ఇల్లెందు పట్టణంలోని మహబూబాబాద్ క్రాస్ రోడ్ లో ఉన్న సువర్చల ఆంజనేయస్వామి గుడిలో కేటి రామారావు గోత్ర నామాలతో పూజాదికాలు నిర్వహించారు. అక్కడ నుండి భారీ ర్యాలీతో పట్టణంలో ఆమ్ బజార్ మీదుగా తెలంగాణ తల్లి చౌరస్తాలో పుట్టినరోజు కేకు కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పాలు పంపిణీ చేసి, తదుపరి తెలంగాణ చౌరస్తాలో అన్నదానం చేశారు. అలాగే మెయిన్ రోడ్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష ప్యాడ్లు అదేవిధంగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు.

ఇల్లెందులో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు సుదర్శనం రంగనాథ్, అబ్దుల్ జబ్బర్, శీలం రమేష్, అజ్మీర భావు, అబ్దుల్ నబీ, ఘాజి, సువర్ణపాక సత్యనారాయణ, చీమల సత్యనారాయణ, కుంజ సుకనయ్య, కృష్ణార్జునరావ్, ఎట్టి వీరభద్రం, గంగావతి లక్ష్మణ్ నాయక్, సునీల్, శ్రీకాంత్, గడ్డి శీను, మూలగుండ్ల ఉపేందర్ రావు, రాసపల్లి శ్రీను, లలిత కుమార్ పాసి, కొండ బత్తుల శ్యామ్, నార్లకోటి రాజ్ కోటి, రామ్ లాల్ పాసి, సత్యనారాయణ, ఎదలపల్లి రేణుక, భూక్య రామదాస్, హుస్సేన్, వసంతరావు, వివిధ మండలాల నాయకులు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.

ఇల్లెందులో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు