ENGW vs BANW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఫేవరెట్ అయిన ఇంగ్లండ్ (England) తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా మొదట బంగ్లాదేశ్‌తో పలపడుతోంది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ (Heather Knight) బ్యాటింగ్ తీసుకుంది. మెగా టోర్నీలో అదిరే బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్న ఇంగ్లండ్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.
ఇక ఆరంభ పోరులో స్కాట్లాండ్పై విజయం సాధించిన బంగ్లా అదే ఊపులో రెండో విక్టరీపై కన్నేసింది. అయితే.. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఇంగ్లండ్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడం బంగ్లాకు శక్తికి మించిన పనే.
ఇంగ్లండ్ జట్టు : మయా బౌచర్, డానియల్ వ్యాట్, అలిసే క్యాప్సే, నాట్ సీవర్ బ్రంట్, హీథర్ నైట్(కెప్టెన్), అమీ జోన్స్(వికెట్ కీపర్), డానియెల్ గిబ్సన్, సోఫీ ఎకిల్‌స్టోన్, చార్లొట్టే డీన్, సారాహ్ గ్లెన్, లిన్సే స్మిత్.
బంగ్లాదేశ్ జట్టు : శాతీ రాణి, దిలారా అక్తర్, శోభనా మొస్ట్రే, నిగర్ సుల్తానా(కెప్టెన్, వికెట్ కీపర్), తాజ్ నెహర్, శొర్నా అక్తర్, రితూ మోని, ఫాహిమా ఖాతూన్, రబెయ ఖాన్, నహిదా అక్తర్, మరుఫా అక్తర్.