Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్(2025-27) తొలి సిరీస్ కోసం భారత జట్టు (Team India) ఇంగ్లండ్ చేరుకుంది. శుక్రవారం రాత్రి మీడియా సమావేశం అనంతరం హెడ్‌కోచ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Subaman Gill)తో పాటు టీమిండియా బృందం ముంబైలో లండన్ విమానం ఎక్కింది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం శనివారం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో అడుగుపెట్టారు. 5 టెస్టుల సిరీస్ కోసం భారత బృందం ఇంగ్లండ్‌లో కాలు మోపింది అంటూ బీసీసీఐ ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేసింది.
దేశవాళీ, ఐపీఎల్లో నిలకడగా రాణించిన సాయి సుదర్శన్ ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై కూడా చెలరేగి ఆడాలనుకుంటున్న ఈ చిచ్చరపిడుగు సిరీస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. భారత జట్టులో అది కూడా టెస్టు ఆటగాడిగా ఎంపిక కావడం నిజంగా చాలా గొప్ప విషయం. లండన్లోకి స్వాగతం పలుకుతున్నా సుదర్శన్ బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో అన్నాడీ యువకెరటం.
Touchdown UK 🛬#TeamIndia have arrived for the five-match Test series against England 🙌#ENGvIND pic.twitter.com/QK5MMk9Liw
— BCCI (@BCCI) June 7, 2025
సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్‌ల గైర్హాజరీలో తొలిసారి భారత జట్టు విదేశీ పర్యటనకు వెళ్లింది. ఇక కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే మొదటి సిరీస్. సో.. నాయకుడిగా తనను తాను నిరూపించుకునేందుకు అతడికి ఇదొక అవకాశం. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌ను ప్లే ఆఫ్స్ తీసుకుకెళ్లిన ఈ యంగ్ కెప్టెన్.. ఇప్పుడు కోట్లాది మంది ఆశల్ని మోస్తూ ఇంగ్లండ్‌లో ‘శభాష్ గిల్’ అనిపించుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. అతడికి అన్నివిధాలా అండగా కోచ్ గంభీర్ ఉండనే ఉన్నాడు. వీళ్ల కాంబినేషన్లో భారత జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
డబ్ల్యూటీసీ సైకిల్లో ఇంగ్లండ్, భారత జట్లకు ఇదే మొట్ట మొదటి సిరీస్. జూన్ 20 లీడ్స్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. కాబట్టి.. ఇరు టీమ్‌లు విజయం కోసం గట్టిగానే పోరాడనున్నాయి. బర్మింగ్హమ్లో జూలై 2న రెండో మ్యాచ్, లార్డ్స్‌లో జూలై 10న మూడో టెస్టు, మాంచెస్టర్‌లో జూలై 23 నాలుగో మ్యాచ్, ఓవల్‌లో ఆగస్ట్ 4న ఐదో టెస్టులో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి.
Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪
A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq
— BCCI (@BCCI) May 24, 2025