ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు( BRS Senior Leader) రాజేందర్ రెడ్డి ( Rajender Reddy ) శనివారం గుండెపోటుతో (Heart Stroke) మరణించారు. ఆయన మృతికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, సతీమణి చిట్టెం సుచరిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజేందర్ రెడ్డి సహృదయులని పార్టీ అభివృద్ధిలో ఆయన సహకారం మరువలేనిదన్నారు. ఆయన మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతాపం చ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గ్రామానికి చేరుకొని మృతిని సోదరుడు మాజీ ఎంపీపీ వెంకట్రామరెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు
. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వగ్రామంలో నిర్వహించిన రాజేందర్ రెడ్డి అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే దంపతులతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజుల ఆశిరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు సూర్య ప్రకాష్ రెడ్డి, అరవింద్ కుమార్, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జయమ్మ నరసింహ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, కల్లు గీత కార్మిక సంఘం సొసైటీ రాష్ట్ర కార్యదర్శి శివన్న గౌడ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.