Poorna | నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అందాల తార శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది . సీమ టపాకాయ్, అవును తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్‌లోను మెరిసింది. దసరా, అఖండ, గుంటూరు కారం, డెవిల్ తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ తో అదరగొట్టింది. అలాగే పలు టీవీ షోల్లోనూ కనిపించి సందడి చేసింది. ఇక ఈ అమ్మడు కెరీర్ పీక్స్‌లో ఉండగానే దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో పెళ్లి పీటలెక్కంది . 2022 జూన్ 12న దుబాయిలో వివాహం చేసుకుంది.
ఇక 2023 ఏప్రిల్‌లో హమ్దాన్ అసిఫ్ అలీ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పూర్ణ. అప్పుడప్పుడు పూర్ణ సోషల్ మీడియాలో తన కుమారుడి ఫొటోలని షేర్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య తన కుమారుడి రెండో పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహంచారు పూర్ణ దంపతులు.అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేశాయి. ఇక నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం తన భర్త, కొడుకులతో కలిసి నేడు బక్రీద్ పండుగను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా స్పెషల్ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
ఇందులో పూర్ణ ఫ్యామిలీని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మీ కుమారుడు భలే ముద్దుగా ఉన్నాడుగా అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే, మరి కొందరు మీ జంట బాగుందని అంటున్నారు. కాగా పూర్ణ చివరిగా నాని ‘దసరా’ సినిమాలో కనిపించి మెప్పించింది. త్వరలోనే ఆమె మళ్ళీ సినిమాలోకి వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా పూర్ణ మలయాళీ అమ్మాయి అయిన తెలుగు సినిమాలతో స్టార్డమ్ ని సంపాదించుకుంది. సినిమాలు మాత్రమే కాదు తెలుగు షోల్లో కూడా పాల్గొని ఇక్కడ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది.