నల్లగొండ సిటీ జూన్ 7 : సోషల్ మీడియాపై పోలీస్ శాఖ పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేసిందని, ఎవరైనా వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా వద్ద పోలీస్ బందోబస్తును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక బక్రీద్ అని, పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.
ప్రజలంతా మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ఇతర మతాలను గౌరవించుకుంటూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. ప్రజలు సామాజిక మాద్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దన్నారు. ప్రజలు ఆపద సమయంలో డయల్ 100 లేదా సంబదిత పోలీస్ స్టేషన్లను సంప్రదించవ్చని పేర్కొన్నారు.