Champions Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) నిర్వహణపై గందరగోళానికి తెరపడలేదు. అసలు పాక్ గడ్డపై భారత జట్టు (Team India) ఆడుతుందా? లేదా? అనేది ఇప్పటికీ సందేహంగానే ఉంది. భద్రత కారణాల దృష్ట్యా దాయాది దేశానికి ఆటగాళ్లను పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సుముఖంగా లేదు. అయితే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు కచ్చితంగా తమ దేశం వస్తుందని, చాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందని ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో ఓ వార్త వైరల్ అవుతోంది.
ఈసారి చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో జరుగుతుందనిఎప్పటినుంచో కథనాలు వస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఫైనల్ అయినా లాహోర్‌లో నిర్వహిస్తాం అని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) అనడం చూశాం. ఇక ముందునుంచి అనుకున్నట్టే ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరగడం ఖాయం అనిపిస్తోంది. టీమిండియా మ్యాచ్‌లకు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత? అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
🚨 TEAM INDIA 🇮🇳 WON’T BE TRAVELLING TO PAKISTAN 🇵🇰
– The BCCI has communicated with the PCB that due to security concerns, they won’t travel to Pakistan for 2025 Champions Trophy. Their desire is to play all their games in Dubai.#ChampionsTrophy pic.twitter.com/4ghDY8KNv4
— Richard Kettleborough (@RichKettle07) November 8, 2024
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగనుంది. ఆతిథ్య హక్కులు దక్కించుకున్న పీసీబీ ఇప్పటికే కొత్త స్టేడియాల నిర్మాణం, పాత వాటికి మరమ్మతుల పనులను శరవేగంగా చేపడుతోంది. కానీ, బీసీసీఐ మాత్రం భారత జట్టును పాక్‌కు పంపేందుకు సిద్ధంగా లేదు. అవసరమైతే హైబ్రిడ్ మోడల్లో టోర్నీ జరపాలని డిమాండ్ చేస్తోంది. ఇదే విషయాన్ని భారత్ – బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన కాన్పూర్ టెస్టు సందర్భంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించాడు.
సరిహద్దు వివాదాల కారణంగా 2013 తర్వాత భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. పాక్‌కు టీమిండియా వెళ్లలేదు. అయితే.. ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్లో జరిగినా సరే నిరుడు వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు బాబర్ ఆజాం నేతృత్వంలోని పాక్ జట్టు భారత్‌కు వచ్చింది. దాంతో.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దాయాది గడ్డపై అడుగుపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Allahmdulliah ! This was for our brothers and sisters in Israel . 🤲🏼🇮🇳#INDvsPAK pic.twitter.com/A1gud4HiI1
— sanatani chori (@gujrati_chori) October 14, 2023
కానీ, బీసీసీఐ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. అందుకని ఇరు బోర్డులకు న్యాయం చేసే దిశగా ఐసీసీ త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే వీలుంది. పాక్‌లో మెగా టోర్నీ సాఫీగా జరిగేలా చూస్తూనే.. టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తోందని సమాచారం.