పాట్నా: ఛత్ పూజ సందర్భంగా కొందరు యువకులు చెరువులోకి పడవలో వెళ్లారు. అయితే ఎక్కువ మంది యువకులు ఉండటంతో ఆ పడవ బోల్తా పడింది. (Boat Capsizes) ఇద్దరు యువకులు ఆ చెరువులో మునిగి మరణించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. బీహార్లోని ఛాప్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఛత్ పూజ చివరి రోజు కావడంతో శుక్రవారం ఉదయం పది మందికిపైగా యువకులు బోటులో చెరువులోకి వెళ్లారు. అయితే ఓవర్ లోడ్ కారణంగా ఆ పడవ మునిగిపోయింది. ఎనిమిది మంది యువకులను స్థానికులు రక్షించారు.
కాగా, పంచబింద గ్రామానికి చెందిన 20 ఏళ్ల బిట్టు కుమార్, 18 ఏళ్ల సూరజ్ కుమార్ ఆ చెరువులో మునిగిపోయారు. స్థానికులు వారిని బయటకు తీసుకురాగా అప్పటికే మరణించారు. గల్లంతైన ఒక యువకుడి కోసం ఆ చెరువులో గాలిస్తున్నారు.
మరోవైపు ఒక్కొక్కరి నుంచి రూ.30 వసూలు చేసి పడవలో ఎక్కువ మందిని ఎక్కించిన వ్యక్తి ఈ ప్రమాదం తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం తెలిసిన తర్వాత చాలా ఆలస్యంగా పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడలేకపోవడంపై గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
छोटी सी नाव पर क्षमता से अधिक लोग सवार थे, जिसके बेकाबू होने से हादसा हुआ !!
पानी में डूबने से दो लोगों की मौत हो गई, वहीं, 8 लोग सुरक्षित बाहर निकल गए, उनका अस्पताल में इलाज चल रहा है !!
बिहार के छपरा के पचभिंडा में एक तालाब में शुक्रवार सुबह एक ओवरलोड नाव पलट गई !!… pic.twitter.com/Q8azfl3lzD
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) November 8, 2024