Srisailam | శ్రీశైలం : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం రానున్నారు. విజయవాడ పున్నమి ఘాట్లో సీ ప్లెయిన్ను ప్రారంభించి శ్రీశైలానికి సీప్ లైన్ ద్వారా రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు పర్యటించే ప్రదేశాలను ఎస్పీ స్వయంగా పరిశీలించి భద్రతా చర్యల దిశగా తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. సీఎం శ్రీశైలం పాతాళగంగ బోటింగ్ ప్రదేశం నుండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరిగి వెళ్లే వరకు సుమారు 523 మంది పోలీస్ అధికారులు సిబ్బంది, 10 స్పెషల్ పార్టీ బృందాలు, 4 గ్రే హాండ్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను వివిధ సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు సీఐ నుండి డీఎస్పీ స్థాయి వరకు అధికారులను నియమించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో 34 మంది బీడీ టీంల సహాయంతో డీఎఫ్ఎండీలు, హెచ్ఎఫ్ఎండీలు, ఇతర పూర్తి పరికరాలతో క్షుణ్ణంగా తనిఖీలు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Lakshmi Parvathi | టీడీపీ పెద్దలకు కూడా హిట్లర్ లాంటి గతే పడుతుంది.. లక్ష్మీపార్వతి సీరియస్