Lakshmi Parvathi | టీడీపీ పెద్దలకు కూడా హిట్లర్ లాంటి గతే పడుతుంది.. లక్ష్మీపార్వతి సీరియస్
Lakshmi Parvathi | సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌ల అక్రమ అరెస్టులపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏపీలో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తుందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు.
Lakshmi Parvathi | సోషల్‌మీడియా యాక్టివిస్ట్‌ల అక్రమ అరెస్టులపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏపీలో నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తుందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు.
ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని లక్ష్మీపార్వతి అన్నారు. హామీల అమలుపై ప్రశ్నిసతే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్‌మీడియా కార్యకర్తలను అర్ధరాత్రి ఇంటికెళ్లి మరీ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. పాలన చేతగాక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. నీచమైన సామాజిక వ్యవస్థను తయారు చేస్తున్నారని ఆరోపించారు.
వాస్తవానికి మహిళలపై టీడీపీ వాళ్లే దారుణమైన పోస్టులు పెడుతున్నారని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి పోస్టుల వల్లే తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. హిట్లర్ లాంటి వ్యక్తే దిక్కుమొక్కు లేకుండా చనిపోయారని.. టీడీపీ పెద్దలకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని విమర్శించారు. ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకుండా జనం మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్‌మీడియా వల్లే చంద్రబాబు చేస్తున్న అవినీతి బయటపడుతుందని తెలిపారు. తమపైనా అత్యంత దారుణమైన పోస్టులు పెట్టారని తెలిపారు.
అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి తనను బూచిగా చూపించారని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్‌ను పిచ్చోడిలా చిత్రీకరించి బొమ్మలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గతంలో ఎన్టీఆర్‌ను కించపరుస్తూ వేసిన కార్టూన్లను మీడియాకు చూపించారు. ఇప్పుడు విజయమ్మ రాసిన లేఖను కూడా ఫేక్ అని టీడీపీ ట్విట్టర్లో పెట్టారని అన్నారు. చివరకు విజయమ్మ వీడియో చేసి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. ఇంత దరిద్రపు పాలనను ఎప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

