Abudhabi T 10 League : ఎడారి దేశంలో పొట్టి క్రికెట్ జాతరకు మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబీ వేదికగా నవంబర్ 21వ తేదీన ప్రతిష్ఠాత్మక టీ10 లీగ్ షురూ కానుంది. ఈసారి జరుగబోతున్న 8వ సీజన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. మునపెన్నడూ లేని విధంగా టైటిల్ కోసం ఈ సీజన్లో 10 జట్లు పోటీ పడనున్నాయి. దాంతో, ఈ మెగా టోర్నీ మరింత ఆసక్తికరంగా సాగుతూ.. అభిమానులను అలరించనుంది.
అబుదాబీ టీ10 లీగ్ 8వ సీజన్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. టోర్నీలో భాగంగా 40 మ్యాచ్‌లను జయెద్ క్రికెట్ స్టేడియం, అబుధాబీ క్రికెట్ స్పోర్ట్స్ హబ్‌లో నిర్వహించున్నారు. 10 ఓవర్ల ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ కేవలం 12
రోజుల్లోనే ముగియనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిన సాగే లీగ్ మ్యాచ్‌ల అనంతరం టాప్ – 5 జట్లు ఫైనల్ బెర్తు కోసం తలపడుతాయి.
Grab your tickets now and back the Strikers! 💥 #StrikeFearlessly#AbuDhabi #AbuDhabiT10 #T10 #ADT10#CricketsFastestFormat #InAbuDhabi #Strikers #StrikeFearlessly #Tickets pic.twitter.com/zEPoLvT4xI
— New York Strikers (@NewYorkStrikers) November 8, 2024
రెండు ప్లే ఆఫ్స్ అనంతరం.. ఎలిమినేటర్ 1, ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లు ఉంటాయి. ఇక క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2లో గెలుపొందిన జట్లు కప్ కోసం అమీతుమీకి సిద్ధమవుతాయి. డిఫెండింగ్ చాంపియన్ న్యూయార్క్ స్ట్రయికర్స్ నవంబర్ 22న తొలి మ్యాచ్ ఆడనుంది. నిరుడు రన్నరప్ దక్కన్ గ్లాడియేటర్స్ జట్టు ఈసారి కప్ ముద్దాడలనే పట్టుదలతో ఉంది.
పది జట్లు ఇవే : న్యూయార్క్ స్ట్రయికర్స్, దక్కన్ గ్లాడియేటర్స్, ఢిల్లీ బుల్స్, టీమ్ అబుదాబీ, నార్తర్న్ వారియర్స్, మొర్రిస్విల్లే సాంప్ ఆర్మీ, బంగ్లా టైగర్స్, చెన్నై బ్రేవ్ జాగ్వార్స్, యూపీ నవాబ్స్, బోల్ట్స్ అజ్మన్.