జయశంకర్ భూపాలపల్లి : వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన జయశంకర్ భూపాలపల్లి(Bhupalapally) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..నెల రోజుల క్రితం గరిశెల రజిత అనే మహిళను కుక్క కరవడంతో జిల్లా దవాఖానలో వంద పడకల హాస్పిటల్కి రాగా.. రేబిస్ ఇంజక్షన్(Rabies vaccine) వేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే బాధిత మహిళను హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించారు. బాధితురాలి శరీరంలో ఆర్గాన్స్ అన్ని పాడవడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, జిల్లా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే రజిత మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.