T20 World Cup 2024 : ఐసీసీ ట్రోఫీ వేటకు సిద్దమైన టీమిండియా(Team India) ప్రాక్టీస్ వేగం పెంచింది. టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) సన్నాహకాల్లో భాగంగా.. న్యూయార్క్లోఏని కంటిగూ పార్క్(Kantiague Park)లో భారత జట్టు నెట్ సెషన్లో పాల్గొంది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు భారత క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు.
వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) డ్రైవ్ షాట్లు సాధన చేయడం పూర్తయ్యాక బౌలింగ్ వేశాడు. కుర్ర ఓపెనర్ యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్, హిట్టర్ శివం దూబే, రింకూ సింగ్, రవీంద్ర జడేజాలు తమ బ్యాట్ పవర్ చూపించారు.
భారత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో బౌలింగ్ దళం సైతం గట్టిగానే సాధన చేసింది. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, చాహల్‌లు నెట్స్‌లో చెమటోడ్చారు. భారత క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. మెగా టోర్నీలో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల కారణంగా వరల్డ్ కప్ కోసం భారత ఆటగాళ్లు విడతలుగా న్యూయార్క్ చేరుకున్నారు. మే 25న రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌తో పాటు ఓపెనర్ యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్, దూబే, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, లు వెళ్లగా.. మే 28న రింకూ సింగ్ జట్టుతో కలిశాడు. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) సైతం వరల్డ్ కప్ కోసం అమెరికా విమానం ఎక్కేశాడు. ఐపీఎల్ పదిహేడో సీజన్ తర్వాత బ్రేక్ తీసుకున్న విరాట్ శుక్రవారం న్యూయార్క్ బయల్దేరాడు. జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగే వామప్ మ్యాచ్‌లో అతడు ఆడకపోవచ్చు. అయితే.. ఐర్లాండ్(Ireland)తో మ్యాచ్‌లో రన్ మెషిన్ కోహ్లీ బరిలోకి దిగుతాడు.