Viral news | యువకుడి కడుపులో ఇనుప మేకులు, నట్లు, బోల్టులు.. అవాక్కైన వైద్యులు..!
Viral news | రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో వైద్యులే కంగుతినే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించిన సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రి వైద్యులు.. అతని కడుపులో బయటపడిన వస్తువులను చూసి కంగుతిన్నారు.
Viral news : రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో వైద్యులే కంగుతినే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించిన సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రి వైద్యులు.. అతని కడుపులో బయటపడిన వస్తువులను చూసి కంగుతిన్నారు. అతని పొట్టలో మొత్తం మేకులు, సూదులు, తాళం చెవులు, నట్లు, బోల్టుల లాంటి లోహాపు వస్తువులు బయటపడటంతో అవాక్కయ్యారు.
వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఓ యువకుడు (21) ఇటీవల జైపుర్‌లోని సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు అతడికి ఎక్స్‌రే, సీటీ స్కాన్ లాంటి పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అతడి పొట్టలో ఇనుప వస్తువులు పేరుకుపోయినట్లు గుర్తించారు. వాటిలో కొన్ని పెద్ద పేగులోకి వెళ్లిపోయినట్లు గమనించారు. దాంతో వైద్య బృందం అతడికి లాప్రోస్కోపీ, కొలనోస్కోపీ నిర్వహించింది.
దాదాపు మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి ఆ వస్తువులను తొలగించారు. రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది. బాధిత యువకుడి మానసిక స్థితి సరిగ్గా లేదని, ఈ క్రమంలోనే ఇనుప మేకులు, సూదులు వంటి మింగాడని సర్జరీకి ముందు అతడి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే నొప్పి రావడంతో తొలుత ఆళ్వార్‌లోని ఆస్పత్రికి తరలించామని, అనంతరం జైపూర్‌కు తీసుకొచ్చామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Jaipur
- nails
- Needles
- Nuts And Bolts
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

