Elephant | మున్నార్లో ఏనుగు బీభత్సం.. పర్యాటకుల కార్లు ధ్వంసం
Elephant | కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మున్నార్ (Munnar)లో ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది.
Elephant | కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మున్నార్ (Munnar)లో ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పర్యాటకుల వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో పర్యాటకులు తమ వాహనాలను వదిలి పరుగులు తీశారు. ఏనుగు దాడిలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటన కల్లార్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో చోటు చేసుకుంది. కొందరు పర్యాటకులు రెండు వాహనాల్లో మున్నార్వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో కల్లార్ డంపింగ్ యార్డు సమీపంలో పడయప్ప (Padayappa) అనే అడవి ఏనుగు పర్యాటక వాహనాలకు అడ్డంగా వచ్చి బీభత్సం సృష్టించింది. దీంతో అందులోని పర్యాటకులు తమ వాహనాల నుంచి కిందకు దిగి అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం రెండు కార్లపై ఏనుగు దాడి చేసింది. ఈ ఘటనలో ఆ వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. అనంతరం సమీపంలోని పర్యాటకులపైకి కూడా ఏనుగు దూసుకెళ్లింది. అయితే, యువకులు పరుగులు తీయడంతో పడయప్ప సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఏనుగు దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Tourists harassed an Tusker named Padayappa on Nallathanni Kallar road today,Munnar region of Kerala State.FD should take immediate action against them and impound these two vehicles with KL registration @moefcc @rameshpandeyifs @ForestKerala @saseendran_ak @rashtrapatibhvn pic.twitter.com/5w5X64T7H3
— Parthiban S (@Parthiban951428) May 26, 2024
Also Read..
Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి దుర్మరణం
Tirumala | తిరుమల కొండకు భారీగా తరలివస్తున్న భక్తులు.. నిన్న ఒక్కరోజే 89,161 మంది దర్శనం
Dhadak 2 | బాలీవుడ్ నుంచి క్రేజీ సీక్వెల్.. ఇంట్రెస్టింగ్గా ‘ధడక్ 2’ అనౌన్స్మెంట్ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

