Dhadak 2 | బాలీవుడ్ నుంచి క్రేజీ సీక్వెల్.. ఇంట్రెస్టింగ్గా ‘ధడక్ 2’ అనౌన్స్మెంట్ వీడియో
Dhadak 2 | ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని మూవీలు విడుదల కాకముందే సెకండ్ పార్ట్ ఉంటుందని ప్రకటించగా మరికొన్ని ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సీక్వెల్స్ తీస్తున్నాయి. ఇక ఈ ఏడాది వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ప్రాజెక్ట్‌లలో 'పుష్ప', 'సలార్', 'దేవర', 'ఇండియన్ 2', 'వార్ 2' చిత్రాలు ఉన్నాయి.
Dhadak 2 | ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని మూవీలు విడుదల కాకముందే సెకండ్ పార్ట్ ఉంటుందని ప్రకటించగా మరికొన్ని ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సీక్వెల్స్ తీస్తున్నాయి. ఇక ఈ ఏడాది వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ప్రాజెక్ట్‌లలో ‘పుష్ప’, ‘సలార్’, ‘దేవర’, ‘ఇండియన్ 2’, ‘వార్ 2’ చిత్రాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో మూవీ వచ్చి చేరింది. 2016లో మరాఠీ నుంచి బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం సైరట్(Sairat). కేవలం మరాఠీలోనే రూ.100 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇక ఇదే సినిమాను బాలీవుడ్లో ‘ధడక్'(Dhadak) పేరుతో రీమేక్ చేశారు, ఇషాన్ ఖట్టర్(Ishan Khattar), అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటినటులుగా వచ్చిన ఈ చిత్రం హిందీలో కూడా మంచి విజయం అందుకుంది. అయితే తాజాగా ‘ధడక్’ సినిమాకు సీక్వెల్ ప్రకటించింది బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రోడక్షన్స్(Dharma productions).
బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi), యానిమల్ భామ త్రిప్తి డిమ్రి(Tripthi Dimri) ప్రధాన పాత్రలో ధడక్ 2 తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ (Shazia Iqbal) దర్శకత్వం వహించబోతుండగా.. ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ & క్లౌడ్ 9 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అనౌన్స్మెంట్ తాజాగా ప్రకటించారు మేకర్స్. ఇక ఈ అనౌన్స్మెంట్ వీడియోలో ఒకప్పుడు ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. వారు వేర్వేరు కులాలకు చెందినవారు, వారి కథ ముగిసింది. అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో సాగింది. ఇక ఈ సినిమాను 2024 నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

