England Tour : సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు మరో సంచలన విజయం సాధించింది. గతంలో ఆస్ట్రేలియాపై గబ్బాలో చరిత్రాత్మక గెలుపుతో రికార్డు సృష్టించిన ఇండియా.. ఈసారి ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతం చేసింది. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టుకు వేదికైన ఎడ్జ్‌బాస్టన్‌లో పరాజయాల ప్రస్థానానికి ఎండ్ కార్డు వేసింది యువభారత్. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు సెంచరీతో పరుగుల వరద పారించగా.. ఆకాశ్ దీప్ చిరస్మరణీయ బౌలింగ్‌తో ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. అంతే.. 58 ఏళ్లుగా ఆతిథ్య జట్టు కంచుకోటగా ఉన్న ఆ మైదానంలో భారత్ జయకేతనం ఎగురవేసింది.
గతంలోనూ ఇంగ్లండ్ వేదికలపై భారత జట్టు అద్బుత విజయాలు లిఖించింది. అయితే.. వీటిలో ఏయే మైదానంలో తొలిసారి టీమిండియా గెలుపు తట్టిందో చూద్దాం. ఓవల్ మైదానంలో భారత్ 1971 ఆగస్టు 24న విజయబావుటా ఎగురవేసింది. అనంతరం పదిహేనేళ్లకు లార్డ్స్‌లో గెలుపొందింది టీమిండియా. అదే ఏడాది హెడింగ్లేలోనూ ఆతిథ్య జట్టుకు షాకిచ్చిన ఇండియా.. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జహీర్ ఖాన్ విజృంభణతో 2007లో విక్టరీ కొట్టింది.
ఆ తర్వాత సచిన్, ధోనీ, కోహ్లీ ఇలా దిగ్గజ ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా ఎడ్జ్‌బాస్టన్‌లో మాత్రం ఓటమే ఎదురైంది. అలాంటిది గిల్ నేతృత్వంలోని భారత జట్టు బెన్ స్టోక్స్ సేనను ముప్పతిప్పలు పెడుతూ చిరస్మరణీయ విజయం సాధించింది.
This test victory is special. Thank you Team India and special thanks to Akash Deep for doing a miracle in the absence of Bumrah. pic.twitter.com/yVQwMAgx3l
— R A T N I S H (@LoyalSachinFan) July 6, 2025
Shubman Gill’s first win as Test captain = HISTORIC ✨ pic.twitter.com/xtf1WIivGf
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2025
బర్మింగ్హమ్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. బజ్ బాల్ ఆటతో ప్రత్యర్థుల భరతం పట్టే ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269, 161) విధ్వంసక బ్యాటింగ్‌కు.. ఆకాశ్ దీప్(6-99), సిరాజ్(6-70) అద్భత బౌలింగ్ తోడవ్వగా చరిత్రలో నిలిపోయే విక్టరీ సాధించింది. ఆల్‌రౌండ్ షోతో ఆతథ్య జట్టును వణికించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ బృందంపై 336 పరుగులతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఐదు టెస్టుల అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో బోణీ కొట్టింది.
A historic win at Edgbaston 🙌#TeamIndia win the second Test by 336 runs and level the series 1-1 👍 👍
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF #ENGvIND pic.twitter.com/UsjmXFspBE
— BCCI (@BCCI) July 6, 2025
A historic win at Edgbaston 🙌#TeamIndia win the second Test by 336 runs and level the series 1-1 👍 👍
Scorecard ▶️ https://t.co/Oxhg97g4BF #ENGvIND pic.twitter.com/UsjmXFspBE
— BCCI (@BCCI) July 6, 2025