Ponguleti Srinivas Reddy | పేదలు కాదు వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులు.. ఖమ్మంలో ఇండ్ల బాధితులపై పొంగులేటి ప్రేలాపన
Ponguleti Srinivas Reddy | కండ్ల ముందు తమ ఇండ్లు కూలగొడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పుట్టెడు దు:ఖంతో కుమిలిపోతున్న బాధితులపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రేలాపనలు చేశారు.
Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ): కండ్ల ముందు తమ ఇండ్లు కూలగొడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పుట్టెడు దు:ఖంతో కుమిలిపోతున్న బాధితులపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రేలాపనలు చేశారు. వారిని కించపరిచేలా, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారందరినీ పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చారు. వాళ్లలో ఎవరూ నిజమైన బాధితులు కాదనేలా వ్యాఖ్యానించారు.
ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో గురువారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొడుతున్నదంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఓవైపు కండ్ల ముందు ఇండ్లు కూలగొడుతున్నప్పటికీ వాటిని ఆయన సమర్థించుకోవడం గమనార్హం.
ఓ వైపు పేదల ఇండ్లు కూలగొడుతూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తూనే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా తమది పేదల ప్రభుత్వమని, తమ పేటెంటే పేదోళ్లని, వాళ్ల ఆశీర్వాదంతోనే ప్రభుత్వం నిలబడిందంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమ ప్రభుత్వం నిజమైన పేదలను ఎప్పుడూ విస్మరించబోదని, వారిని ఇబ్బందులు పెట్టబోదని చెప్పారు. ఒకవేళ ఇండ్లు కోల్పోతున్న వారిలో పేదవాళ్లు, నిరుపేద అభాగ్యులెవరైనా ఉంటే వారిలో అర్హులైన వారికి, గతంలో ఏ పథకం తీసుకోని వారికి తగు న్యాయం చేస్తామని తెలిపారు. అంతేగానీ పేదల ఇండ్ల కూల్చివేతను ఆపేస్తామని మాత్రం మంత్రి చెప్పలేదు. అంటే ఇకపై కూడా పేదల ఇండ్ల కూల్చివేత కొనసాగుతుందని ఆయన పరోక్షంగా చెప్పడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

