Pets | నర్సాపూర్, జూలై 6 : నర్సాపూర్ పట్టణంలోని పశు వైద్యశాలలో వెటర్నరీ ఏడీ జనార్థన్‌రావు ఆధ్వర్యంలో పెంపుడు జంతువులైన కుక్కలకు, పిల్లులకు ఆదివారం రేబీస్ వ్యాధి టీకాలను ఉచితంగా వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జూనోట్రిక్ వ్యాధులు అనగా పశువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధులని, ఈ వ్యాధులలో రేబీస్ అనే వ్యాధి చాలా భయంకరమైనదని అన్నారు. ఈ రేబీస్ వ్యాధి ముఖ్యంగా పెంపుడు కుక్కలు, పిల్లులు మొదలగు జంతువుల ద్వారా మానవులకి సంక్రమిస్తుందని అన్నారు. అందువలన పెంపుడు జంతువులకు ప్రతి సంవత్సరం జూలై 6వ తేదిన ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని వెల్లడించారు.
నర్సాపూర్ పట్టణంలోని పశువైధ్యశాలలో ఆదివారం 65 కుక్కలకు, 5 పిల్లులకు రేబీస్ టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది గోవర్ధన్, ఇక్భాల్, వెంకట్ పాల్గొన్నారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు