హైదరాబాద్ ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో కమీషన్ల ఐఏఎస్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారిపై బదిలీ వేటుపడింది. ప్రభుత్వపెద్దకు సన్నిహితుడనే కారణంగా కొద్దినెలలుగా చర్యలకు వెనుకడుగు వేసిన ప్రభు త్వం ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తాజాగా జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆయనను ట్రాన్స్ఫర్ చేసిం ది. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ‘9 నెల ల్లో 18 కోట్ల కమీషన్’ పేరిట ప్రచురితమైన కథనంతో ఆ శాఖలో దుమారం రేగింది. ఈ నేపథ్యంలో సదరు అధికారికి స్థానచలనం కల్పించడం చర్చనీయాంశంగా మారింది.
వైద్యారోగ్యశాఖలో ఓ కార్పొరేషన్‌కు ఎండీగా నియమితుడైన సదరు ఐఏఎస్.. వచ్చీరాగానే అవినీతి పర్వానికి తెరలేపినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. బిల్లుల చెల్లిం పు, ఉద్యోగ విరమణ వయసు పెంపునకు ఉద్యోగుల నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడినట్టు తెలిసింది. సదరు అధికారి తీరును పలుమార్లు ప్రభుత్వపెద్ద దృష్టికి తీసుకెళ్లినా చూసీచూడనట్టు ఆరోపణలు వ చ్చాయి. దీంతో ఆ అధికారి మరింతగా రెచ్చిపోయారు. ప్రతి పనికీ రేటుకట్టి కమీషన్లు ముట్టజెప్పాలని హుకుం జారీ చేశారు. వంద మంది ఉద్యోగుల నుంచి రూ.3 లక్షల చొప్పున రూ.3 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఆయన వ్యవహారాలపై ‘నమ స్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన సంబంధిత శాఖ మంత్రి సద రు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలకు సిఫారసు చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో గురువారం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో కమీషన్ల అధికారిని ఓ జిల్లాకు అదనపు కలెక్టర్‌గా ట్రాన్స్ఫర్ చేశారు.
సదరు అధికారి అక్రమాలపై నిఘావర్గాలు ఆరాతీస్తున్నట్టు తెలిసింది. ఏ ఉద్యోగి నుంచి ఎంతమేర కమీషన్లు దండుకున్నారో సమాచారం సేకరించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. అధికారి అక్రమాలపై ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి నివేదించినట్టు సమాచారం.