హైదరాబాద్, జూలై 25 (నమస్తేతెలంగాణ): ధరణి పోర్టల్ ఆధారంగా జరిగిన లావాదేవీలపై విచారణకు ప్రభుత్వం స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (సెట్)ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి, ఏసీబీ డైరక్టర్ జనరల్ చారుసిన్హా చైర్‌పర్సన్‌గా, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతోపాటు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌కు చెందిన సాంకేతిక నిపుణుడిని బృందంలో సభ్యులుగా నియమించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ధరణి లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు విస్తృత అధికారాలు అప్పగించింది.