హైదరాబాద్, జూలై 25: పారిశ్రామిక, వాణిజ్య రిఫ్రిజరేషన్ పరిష్కారాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐస్‌మేక్ రిఫ్రిజరేషన్ లిమిటెడ్..జపాన్‌కు చెందిన గెలిటీ హోల్డింగ్స్ కో.లిమిటెడ్ రూ.180 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ నిధులను ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు, కార్యకలాపాల ఆధునీకరణకు వినియోగించనున్నట్టు ప్రకటించింది.
12 వేల కోట్ల నిధుల సేకరణలో ఎన్టీపీసీ
న్యూఢిల్లీ, జూలై 25: దేశీయ విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్టీపీసీ భారీ స్థాయిలో నిధులను సేకరించడానికి సిద్ధమైంది. నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా గరిష్ఠంగా రూ.12 వేల కోట్ల వరకు నిధులను సమీకరణకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.