MK Stalin | టెన్నిస్ లెజెండ్‌తో తమిళనాడు సీఎం.. ఎక్కడ కలిశారంటే..?
MK Stalin : తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్(MK Stalin) టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్(Novak Djokovic)ను కలిశాడు. ఈమధ్యే స్టాలిన్ స్పెయిన్‌కు విమానంలో వెళ్లాడు. అనుకోకుండా అదే ప్లేన్‌లో జకోవిచ్ కూడా...
MK Stalin : తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్(MK Stalin) టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్(Novak Djokovic)ను కలిశాడు. ఈమధ్యే స్టాలిన్ స్పెయిన్‌కు విమానంలో వెళ్లాడు. అనుకోకుండా అదే ప్లేన్‌లో జకోవిచ్ కూడా ఉన్నాడు. దాంతో, ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన స్టాలిన్ వెంటనే వరల్డ్ నంబర్ 1తో మాట కలిపాడు. అనంతరం తమిళనాడు సీఎం.. జకోతో ఫొటో దిగాడు.
జకోవిచ్‌తో దిగిన ఫొటోను స్టాలిన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆకాశంలో ఆశ్చర్యం. స్పెయిన్‌కు విమానంలో వెళ్తుండగా టెన్నిస్ లెజెండ్ జకోవిచ్‌ను కలిశాను అని క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open 2024)లో ఓటమి అనంతరం జకో స్వదేశమైన సెర్బియాకు బయలుదేరాడు. ఆ సమయంలోనే అతడు స్టాలిన్‌కు కలిసి ఉంటాడు.
Surprise in the skies: Met #Tennis legend @DjokerNole en route to #Spain! 🎾 pic.twitter.com/VoVr3hmk5b
— M.K.Stalin (@mkstalin) January 29, 2024
ప్రపంచ టెన్నిస్‌లో దిగ్గజ ఆటగాడైన జకోవిచ్ నిరుడు 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్రతో సృష్టించాడు. అయితే.. ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం సెమీస్‌లోనే ఇంటిదారి పట్టాడు. ఇటలీ కెరటం జన్నిక్ సిన్నర్(Jannik Sinner) చేతిలో అనూహ్యంగా కంగుతిన్నాడు. పదిసార్లు చాంపియన్ అయిన జకో సెమీస్‌లోనే వైదొలగడం ఇదే మొదటిసారి.
తండ్రికి తగ్గ తనయుడిగా..
తమిళనాడు రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరొందిన కరుణానిధి(M. Karunanidhi) కుమారుడు స్టాలిన్. చెన్నైకి 45వ మేయర్‌గా పనిచేసిన స్టాలిన్.. 2009 నుంచి 2011 మధ్యకాలంలో తమిళనాడు తొలి డిప్యూటీ సీఎంగా సేవలందించారు. 2018లో తండ్రి కరుణానిధి మరణాంతరం స్టాలిన్ ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ (Dravida Munnetra Kazhagam) పార్టీ అధినేతగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన స్టాలిన్ భారీ మెజార్టీతో గెలిచారు. ఈ మూడేండ్ల పాలనలో తనదైన ముద్రవేసిన స్టాలిన్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.
ఇవి కూడా చదవండి
- Tirumala | తిరుమల శ్రీవారి సేవలో అల్లు స్నేహా రెడ్డి
- India Davis Cup Team | భారత జట్టుకు పాకిస్థాన్ వీసా.. 60 ఏండ్లలో ఇదే మొదటిసారి
- Congress Party | లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

