హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నది. ఆసక్తికరంగా జరిగిన ఫైనల్ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆరు బంతుల్లో 13 రన్స్ అవసరం కాగా.. రాజస్థాన్ బ్యాటర్ పావల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివరి బంతికి రెండు పరుగులు అవసరం అయిన సమయంలో అతను ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు.
థ్రిల్లింగ్ విక్టరీ నమోదు అయిన నేపథ్యంలో.. సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్(Kavya Maran) చిందేశారు. స్టాండ్స్‌లో కూర్చున్న ఆమె ఒక్కసారిగా లేచి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కెమెరాలన్నీ ఆమెపై ఫోకస్ చేయగా.. కావ్య గంతులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రాజస్థాన్‌పై విజయ నమోదు చేయడాన్ని కావ్య థ్రిల్ అయ్యింది.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును భువనేశ్వర్ అందుకున్నాడు. అతను 41 రన్స్ ఇచ్చి అతి ముఖ్యమైన మూడు వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ కోసం హైదరాబాద్ జట్టు పోటీలో ఉన్నది. ఇప్పటి వరకు 10 మ్యాచుల్లో హైదరాబాద్ ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది. పాయింట్ల టేబుల్లో సీఎస్కేను దాటేసి అయిదవ స్థానంలో ఉన్నది.
Jumps of Joy in Hyderabad 🥳
Terrific turn of events from @SunRisers‘ bowlers as they pull off a nail-biting win 🧡
Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc
— IndianPremierLeague (@IPL) May 2, 2024