తుంగతుర్తి, జనవరి 09 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గత రెండు నెలలుగా నీళ్లు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. రెండు నెలల నుండి నల్లాలు రాక నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీ కార్యవర్గం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పండుగ దగ్గరికి వస్తున్నా కనీసం వాడుకోవడానికి కూడా నీళ్లు లేక బోర్ల కానుండి బిందెలతో మోసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు నీళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మన్నూరు పూర్ణమ్మ, కటకం ఈశ్వరమ్మ, లింగమ్మ, తడకమళ్ల గంగమ్మ, తడకమళ్ల యాదమ్మ, తడకమళ్ల హేమలత, పానగంటి స్వప్న, కటకం రామ, జ్యోతి, కటకం రవి, బొంకూరి మల్లేశ్, తడకమళ్ల సోమయ్య పాల్గొన్నారు.