ముంబై: టీ20 వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టులో సంజూ శాంసన్(Sanju Samson)కు చోటు దక్కింది. అయితే బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను కాదు అని, అతని స్థానంలో సంజూకు అవకాశం ఇచ్చారు. దీనిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాళ్ల కోసం చూశామని, అందుకే కేరళ కెప్టెన్ సంజూకు రెండో వికెట్ కీపర్‌గా అవకాశం ఇచ్చినట్లు అగార్కర్ తెలిపాడు.
కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటర్ అని, కానీ తాము మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కోసం వెతుకుతున్నామని, కేఎల్ ప్రస్తుతం టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నట్లు అగార్కర్ చెప్పాడు. లోయర్ ఆర్డర్లో వచ్చి ఆడే సత్తా సంజూకు ఉన్నట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్లో అయిదో స్థానంలో ఆడుతున్నాడని అజిత్ తెలిపారు. ఎవరు ఉత్తమ బ్యాటర్ అన్న విషయాన్ని ఆలోచించడం లేదని, ఈ ఇద్దరూ బెస్ట్ బ్యాటర్స్ అని, కానీ వరల్డ్‌కప్‌లో లోయర్ ఆర్డర్లో ఆడేవాళ్లు కావాలని అగార్కర్ తెలిపాడు. హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడాన్ని అగార్కర్ సమర్థించుకున్నాడు.