IND vs NZ 2nd Test : పుణే టెస్టులో భారత స్పిన్నర్లు చెలరేగారు. పదికి పది వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేశారు. రంజీల నుంచి వచ్చిన వాషింగ్టన్ సుందర్(7/59) ఏడు వికెట్లతో కివీస్ నడ్డివిరిచాడు. ఆదిలో రవిచంద్రన్ అశ్విన్(3/64) న్యూజిలాండ్ బ్యాటర్లను ఇరకాటంలో పెడితే.. సుందర్ ఇక నేనున్నాంటూ కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. దాంతో, పర్యాటక జట్టు 259 పరుగులకే కుప్పకూలింది.
బెంగళూరు టెస్టులో ఓటమితో తేరుకున్న టీమిండియా పుణేలో పట్టు బిగించేందుకు సిద్దమైంది. స్పిన్ పిచ్‌పై కుర్రాడు వాషింగ్టన్ సుందర్, అశ్విన్‌లు తమ తడాఖా చూపించారు. తొలుత అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టి బ్రేకిస్తే.. ఇక సుందర్ మిడిలార్డర్, టెయిలెండర్ల పని పట్టాడు. అర్ధ శతకాలతో ప్రమాదకరంగా మారిన రచిన్ రవీంద్ర(65)ను బౌల్డ్ చేసి తొలి వికెట్ సాధించిన సుందర్.. వరుసగా చివరి 7 వికెట్లు తీసి తనపై కోచ్, కెప్టెన్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సుందర్ ధాటికి డారిల్ మిచెల్(18), టామ్ బ్లండిల్(3), గ్లెన్ ఫిలిఫ్స్(9), శాంట్నర్(33), సౌథీ(5), అజాజ్ పటేల్(4)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
భారత పిచ్‌లపై ఆడిన అనుభవం గల డెవాన్ కాన్వే(76), రచిన్ రవీంద్ర(68)లు మరోసారి కీలక ఇన్నింగ్స్‌తో కివీస్‌ను ఆదుకున్నారు. తొలి సెషన్ మొదలైన కాసేపటికే అశ్విన్ తన తొలి ఓవర్లే టామ్ లాథమ్(15)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత కాన్వే, విల్ యంగ్(18)ల జోడీ క్రీజులో పాతుకుపోయింది. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్‌బోర్డును నడిపించారు. అయితే.. అశ్విన్ మరోసారి తన అనుభవాన్ని ఉపయోగించి యంగ్‌ను బోల్తా కొట్టించాడు. అంతే.. 76 వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ పడింది. ఆ తర్వాత సెషన్ ఆసాంతం కాన్వే, రచిన్ రవీంద్రను భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు.
Innings Break!
Superb bowling display from #TeamIndia! 💪
7⃣ wickets for Washington Sundar
3⃣ wickets for R AshwinScorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @Sundarwashi5 | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/TsWb5o07th
— BCCI (@BCCI) October 24, 2024
లంచ్ తర్వాత ఇద్దరూ హాఫ్ సెంచరీలతో కివీస్‌కు భరోసానిచ్చారు. కానీ.. సుందర్ పర్యాటక బ్యాటర్లకు షాకిస్తూ వికెట్ల వేట మొదలెట్టాడు. రవీంద్రను బౌల్డ్ చేసిన అతడు.. తనను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని చాటుతూ ఆఖరి 7 వికెట్లను తన ఖాతాలో వేసుకొని రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌లో అత్యుత్తమ టెస్టు గణాంకాలు నమోదు చేసిన మూడో భారత బౌలర్‌గా సుందర్, అశ్విన్ రికార్డును సమం చేశాడు.