Allu Arjun Pushpa 2 | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప ది రూల్’. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం నేడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు పుష్ప 2 టీమ్ భారీ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది.
ఇక ఈ ప్రెస్ మీట్లో పుష్ప నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం గత 2 ఏండ్ల నుంచి పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంతో కష్టపడి పని చేశాడు. అల్లు అర్జున్ కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది. ఇది కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. అలాగే ఈ సినిమాలో గంగమ్మ జాతర ఎపిసోడ్ దాదాపు 35 రోజుల పాటు జరిగింది. ఈ మూవీలోనే బెస్ట్ మాస్టర్ పీస్ ఎపిసోడ్ అవుతుంది. అలాగే పుష్ప 2 షూటింగ్ ఐటెం సాంగ్‌తో సహా నవంబర్ 5వ తారీఖుకి పూర్తవుతుంది. ఆ నమ్మకంతోనే మొదట ప్రకటించినదానికంటే ఒకరోజు ముందుగా డిసెంబర్ 5 రిలీజ్ అని ప్రకటించాం అంటూ నిర్మాత తెలిపాడు.