IND vs ENG : లార్డ్స్‌లో బంతితో మాయ చేసిన వాషింగ్టన్ సుందర్ (2-23) మాంచెస్టర్ టెస్టులోనూ మెరిశాడు. మూడోరోజు లంచ్ తర్వాత ఇంగ్లండ్‌ను గట్టి దెబ్బకొట్టాడు వాషీ. తొలి సెషన్ నుంచి క్రీజులో పాతుకుపోయిన ఓలీ పోప్(71)ను ఔట్ చేసి భారత్‌కు బ్రేకిచ్చాడు. ఆ కాసేపటికే డేంజరస్ హ్యారీ బ్రూక్(3)ను వెనక్కి పంపి ఇంగ్లండ్ స్కోర్ వేగాన్ని తగ్గించాడు. స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు పడినందున జో రూట్ (83) కెప్టెన్ బెన్ స్టోక్స్(4)లు జాగ్రత్తగా ఆడుతున్నారు. మరో ఎండ్‌లో జడేజా సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో ఇద్దరూ రన్స్ తీసేందుకు కష్టపడుతున్నారు. ప్రస్తుతానికి ఇంగ్లండ్ 5 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు పటిష్టి స్థితిలో నిలిచింది. రెండో రోజు బజ్ బాల్ ఆటతో ఓపెనర్లు బెన్ డకెట్(94), జాక్ క్రాలే(84)లు విధ్వంసం సృష్టించగా.. మూడో రోజు మిడిలార్డర్ క్రీజులో పాతుకుపోయారు. జో రూట్ (63 నాటౌట్), ఓలీ పోప్(70 నాటౌట్)లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అర్ధ శతకాలతో చెలరేగారు. పేస్ దళం లో బౌన్స్‌తో ఇబ్బంది పెట్టినా వెరవని ఈ ద్వయం మూడో వికెట్‌కు రన్స్ జోడించింది. లంచ్ సమయానికి ఆతిథ్య జట్టు 2 వికెట్ల నష్టానికి 332 రన్స్ కొట్టింది.