Appointed | కమాన్ పూర్, జూలై 25 : కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా వైనాల రాజును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబుకు నమ్మిన బంటుగా ఉంటూ గత ఎన్నికల్లో మండలంలో తన వంతుగా ఎన్నికలలో అందరితో కలిసి శ్రీధర్ బాబుకు మెజార్టీ రావడానికి కారణమయ్యాడు.
అలాగే వైస్ చైర్మన్ గా మద్దెల రాజయ్య, సభ్యులుగా గుమ్మడి వెంకన్న, అబ్దుల్ రఫీక్, గుగులోతు ప్రవీణ్ కుమార్, పుల్లెల సతీష్, ఆరెల్లి శ్రీనివాస్, దాసరి గట్టయ్య, ముసుగుల నరేందర్ రెడ్డి, జాగిరి సమ్మయ్య, సిద్ధం మురళి, బీ బుచ్చారావు, గుండ భాస్కర్, సురభి జగన్ మోహన్ రావు, ఇనగంటి భాస్కరరావుతో పాటు జిల్లా మార్కెటింగ్ అధికారి, మంథని వ్యవసాయ ఏడీ, కమాన్ పూర్ గ్రామ ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా వైనాల రాజు చైర్మన్ గా నియమితులు కావడంతో కమాన్ పూర్ మండల కాంగ్రెస్ నాయకులు సంబులు చేసుకుంటున్నారు.